: ఖమ్మంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య!
ఒక జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ... రఘునాథపాలెం మండలంలోని సూర్య తండాకు చెందిన సుమన్ ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. కళాశాలకు చెందిన వసతిగృహంలోనే అతను ఉంటున్నాడు. అదే వసతి గృహంలో ఉరేసుకుని సుమన్ తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.