: వెంబ్లీ స్టేడియం బయట వేలాది మంది నిరీక్షణ


లండన్ లోని ప్రఖ్యాత వెంబ్లీ స్టేడియంలో ఈ సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 60 వేల మందిని ఉద్దేశించి మోదీ కీలక ఉపన్యాసం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే టికెట్లు అమ్ముడుబోయాయి. ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అయితే, టికెట్లు దొరకని వారు ఎంతో మంది నిరాశతో ఉన్నారు. మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినే అవకాశం లేక... వారంతా వెంబ్లీ స్టేడియం వెలుపలే నిరీక్షిస్తున్నారు. మోదీ ప్రసంగం కోసం వేలాది మంది తరలిరావడం ఇప్పుడు లండన్ లో పెద్ద చర్చనీయాంశం అయింది.

  • Loading...

More Telugu News