: భగవద్గీత శ్లోకం రాసిన గంటలతో బుకెండ్స్... బ్రిటన్ ప్రధానికి బహూకరించిన మోదీ


బ్రిటన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ కు అరుదైన బహుమతి ఇచ్చారు. భగవద్గీత శ్లోకం రాసిన గంటలతో కూడిన బుకెండ్స్ బహుకరించారని ప్రధాని కార్యాలయం ట్విట్టర్ లో తెలిపారు. వాటిని మార్బుల్, వెండి, చెక్కతో ప్రత్యేకంగా తయారు చేశారు. వాటిని చూసిన కామెరూన్ చాలా ముగ్ధులయ్యారు. అంతేగాక కామెరూన్ భార్యకు మోదీ ప్రత్యేకంగా తయారు చేయించిన శాలువను బహూకరించారు. కేరళ హస్తకళ నైపుణ్యం ఉట్టిపడే హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇచ్చారు.

  • Loading...

More Telugu News