: జిహాదీ జాన్ చనిపోయాడో లేదో ఇంకా తెలియదు: బ్రిటన్ ప్రధాని


సిరియాలోని ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జిహాదీ జాన్ చనిపోయాడో లేదో తనకు ఇంకా తెలియదని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. జిహాదీ జాన్ లక్ష్యంగానే ఈ దాడులు జరిగాయని... అయితే, ఆపరేషన్ ఎంత వరకు విజయవంతమైందో చెప్పలేమని అన్నారు. జిహాదీ జాన్ గా పేరుగాంచిన మహ్మద్ ఎమ్వాజీ ఎంతో మంది కంఠాలను కోసి ఇంటర్నెట్ లో వీడియోలను అప్ లోడ్ చేశాడు. ఈ వీడియాలను చూసినవారంతా ఎంతో భయాందోళనలకు గురయ్యారు. ఐఎస్ఐఎస్ ఇంత క్రూరంగా వ్యవహరిస్తుందా? అన్న విషయం జీహాదీ జాన్ వల్లే ప్రపంచానికి తెలిసింది. ఈ క్రమంలో, జిహాదీ జాన్ ను మట్టుబెట్టేందుకు పక్కా ప్లాన్ తో అమెరికా సేనలు దాడులు నిర్వహించాయి. అయితే, దాడుల్లో జాన్ చనిపోయిన సంగతిని ఇంతవరకు పెంటగాన్ కూడా అధికారికంగా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News