: క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని టి.ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రిస్మస్ ను కూడా అలాగే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం కేసీఆర్ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే క్రిస్మస్ వేడుకలను అధికారికంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ రోజున 2 లక్షల మంది క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేయాలని, డిసెంబర్ 20న ప్రభుత్వం తరపున వారికి విందు ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాదులోని వంద చర్చిలు, మిగతా జిల్లాల్లోని 95 నియోజకవర్గాల్లో కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.