: శ్రీలంకలో పౌరయుద్ధం తర్వాత టెక్నాలజీకి అండగా ప్రభుత్వం


మన పొరుగుదేశమైన శ్రీలంకలో పౌరయుద్ధం 2009లో ముగిసింది. ఆ తర్వాత చాలా గొప్ప మార్పులు సంభవించాయి. ముఖ్యంగా మానవ అభివృద్ధి సూచిక (హ్యుమన్ డెవలప్ మెంట్ అండ్ ఇండెక్స్) విషయంలో ఆ దేశం 73వ స్థానంలో ఉంది. ఈ సూచిక విషయంలో మనదేశం 135వ స్థానంలో, చైనా 91వ స్థానంలో ఉన్నాయి. ఈ విషయంలో భారత్, చైనాల కన్నా మెరుగైన స్థానంలో శ్రీలంక ఉండటం గమనార్హం. అంతేకాకుండా పలు రంగాల్లో ఆ దేశం స్పష్టమైన మార్పులు సాధించింది. ముఖ్యంగా టెక్నాలజీకి అండగా అక్కడి ప్రభుత్వం నడుస్తోంది. ఈ-కామర్స్ రంగంలో పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. ఈ విషయంలో ఆ దేశంనుంచి వారికి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఈ సందర్భంగా శ్రీలంకకు చెందిన అతిపెద్ద ఈ-కామర్స్ సైట్ టకాస్.ఎల్ కే సహ వ్యవస్థాపకుడు లాహిర్ పాథ్మలాల్ మాట్లాడుతూ, ‘పొలిటికల్ సైన్స్ చదువుకున్న నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను. పలు సంస్థలలో ఎన్జీవో లతో కలిసి పనిచేశాను. దేశాభివృద్ధి అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే కొత్తగా వచ్చిన మరో ఈ కామర్స్ సంస్థ డబ్ల్యుఓడబ్ల్యు.ఎల్ కే. శ్రీలంక క్రికెట్ టీమ్ తో జరిగే మ్యాచ్ లకు సంబంధించిన టిక్కెట్లను ఈ సంస్థ విక్రయిస్తుంది. తమిళ్, సింహళం, ఇంగ్లీషు భాషల్లో ఈ సంస్థ తమ సైట్లను అభివృద్ధి చేసింది. శ్రీలంక దేశానికి చెందిన ప్రజల్లో అధికశాతం ఆన్ లైన్ సేవలను వినియోగించుకుంటున్నారు. రాబోయే సంవత్సరాలలో శ్రీలంకలో 4 జీ కాలనీస్ ఏర్పాటుకు, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు గూగుల్స్ బెలూన్ ప్రాజెక్టు ద్వారా సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News