: ఢిల్లీకి వస్తున్న 'మేడమ్ టుస్సాడ్స్' మైనపు బొమ్మల మ్యూజియం


లండన్ లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం (మైనపు బొమ్మల ప్రదర్శనశాల) ఢిల్లీకి రాబోతోంది. ఇండియా-యూకే సహకారంలో భాగంగా ఈ మ్యూజియంను ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మ్యూజియంను ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ ప్రకటించారు. 2017లోగా ఢిల్లీలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేస్తారు. లండన్ లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్, కత్రినా కైఫ్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ తదితరుల మైనపు బొమ్మలు కొలువుదీరాయి. మరోవైపు, ఇప్పటికే లండన్ తో పాటు ఆమ్ స్టర్ డ్యామ్, బ్యాంకాక్, బీజింగ్, బెర్లిన్, బ్లాక్ పూల్, హాలీవుడ్, హాంగ్ కాంగ్, లాస్ వెగాస్, న్యూయార్క్, నయాగరా ఫాల్స్, ఒర్లాండో, ప్రేగ్, శాన్ ఫ్రాన్సిస్కో, షాంఘై, సింగపూర్, సిడ్నీ, వియన్నా, వాషింగ్టన్ డీసీ, వుహాన్, టోక్యోలలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలు ఉన్నాయి. కొరియాలోని బుసాన్ లో టెంపరరీ మ్యూజియం ఉంది.

  • Loading...

More Telugu News