: కేసీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) ఓ సూచన చేశారు. దూకుడు కొంచెం తగ్గించి, అందిరినీ కలుపుకొని పోవాలని సూచించారు. గ్రామ జ్యోతి, మిషన్ కాకతీయ, విద్యుత్ అంశాల్లో కేసీఆర్ విధానాలు బాగానే ఉన్నాయని కితాబిచ్చారు. వరంగల్ ఉప ఎన్నికలో ఎవరికి ఓటు వేయాలనేది అక్కడి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ పాలన సరిగా లేదనే విషయాన్ని బీహార్ ప్రజలు ఎత్తి చూపారని... అయితే, తమ లోపాలను సరిదిద్దుకోవడానికి బీహార్ ఫలితాలు బీజేపీకి అనుకూలిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ మరికొంత సమయం వేచి ఉండాలని అన్నారు.