: వారణాసిలో దారుణం... విదేశీ మహిళా టూరిస్టుపై యాసిడ్ దాడి
ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో ఈ ఉదయం దారుణం జరిగింది. ఇక్కడి కరౌండీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న 23 ఏళ్ల రష్యన్ యువతిపై ఓ వ్యక్తి యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. ఉదయం 4 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి బలవంతంగా దూసుకెళ్లి దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన యువతిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఆమెకు తెలిసిన వాడై ఉండవచ్చని భావిస్తున్నామని, కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.