: రాజ్ నాథ్ పై కాంగ్రెస్ పొగడ్తల వర్షం!


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీపై విపక్షం నుంచే కాక స్వపక్షం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నడూ మీడియా ముందుకు రాని నేతలు కూడా ఇదే అదనుగా నోరు పారేసుకుంటున్నారు. అయితే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పొగడ్తలు వినిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బీజేపీలో ఒక్క రాజ్ నాథ్ సింగ్ మాత్రమే తెలివి కలిగిన నేత అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ప్రకటించారు. బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పార్టీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషిల అభిప్రాయాలను కొట్టిపారేసే వైఖరి సరికాదని రాజ్ నాథ్ సింగ్ పార్టీ నేతలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రషీద్ అల్వీ, రాజ్ నాథ్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News