: అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో రామ్ చరణ్ హల్ చల్


ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలసి అమెరికాలో షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని చరణ్ సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో కాసేపు ముచ్చటించాడు. ఈ విషయాన్ని తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా చరణ్ వెల్లడించాడు. అంతేకాకుండా అక్కడి ఉద్యోగులతో కలసి దిగిన ఫొటోను కూడా అప్ లోడ్ చేశాడు. తనకు బహుమతులు ఇచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపాడు.

  • Loading...

More Telugu News