: ప్రధాని, రాష్ట్రపతి విశాఖ పర్యటన ఖరారు, పోలీసు శాఖలో 12 వేల ఖాళీల భర్తీకి చర్యలు: ఏపీ డీజీపీ


వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల పర్యటన ఖరారైందని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకూ అంతర్జాతీయ స్థాయి నౌకాదళ విన్యాసాలు జరగనున్నాయని తెలిపిన ఆయన, ఈ వేడుకలకు అత్యుత్తమ భద్రత కల్పిస్తున్నామని, నగరంలో 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకూ నౌకాదళ విన్యాసాల ట్రయల్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాన వేడుకలకు 70 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని రాముడు పేర్కొన్నారు. విశాఖ మన్యం ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి రావాల్సివుందని, అవి వస్తే నియామకాల ప్రక్రియ మొదలవుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News