: ఈ నెల 16 నుంచి వరంగల్ లో జగన్ ప్రచారం: పొంగులేటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలోకి దిగనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 19 వరకు జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని వరంగల్ లో మీడియాతో చెప్పారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ, స్టేషన్ ఘన్ పూర్, తొర్రూర్, పరకాలల్లో నిర్వహించే బహిరంగసభల్లో జగన్ పాల్గొంటారని వివరించారు. దివంగత వైఎస్ హాయంలో చేపట్టిన పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు.