: ప్రకాశం జిల్లాలో లారీ బీభత్సం...పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు దుర్మరణం
ప్రకాశం జిల్లాలో నేటి ఉదయం ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డుపై వేగంగా దూసుకువచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కగా నడిచివెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకెళితే... ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద నేటి ఉదయం వేగంగా దూసుకువచ్చిన లారీ ఉన్నట్టుండి పాదచారులపైకి దూసుకెళ్లింది. లారీ ఢీకొట్టడంతో కింద పడిపోయిన నలుగురు పాదచారులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.