: తెలుగు చిత్ర పరిశ్రమలో దళారులు, విడుదలకు నోచని 200 సినిమాలు: తెలంగాణ ఫిలిం చాంబర్


తెలుగు సినీ పరిశ్రమలో దళారీ వ్యవస్థ పెరిగిపోయి, చిన్న చిత్రాల మనుగడ ప్రశ్నార్థకమైందని, ఈ పరిస్థితి మారాలని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, పరిశ్రమ పెద్దల చేతుల్లో సినిమా హాల్స్ ఉండటంతో చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగులుతున్నాయని విమర్శించారు. థియేటర్ల కొరత కారణంగా 200 సినిమాలు విడుదలకు నోచుకోలేదని తెలిపారు. కేంద్రం థియేటర్లపై విధిస్తున్న పన్నులను తీసివేయాలని, ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని వివరించారు. సినిమాల విడుదల, థియేటర్ల లభ్యత వంటి విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు ప్రతాని వివరించారు.

  • Loading...

More Telugu News