: ట్రైన్ టికెట్ రద్దు చేశారా?...జేబు గుల్ల కావాల్సిందే!


రైల్వేల ద్వారా వీలైనంత ఆదాయం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. ఈ మధ్యే టికెట్ల ధర పెంచిన రైల్వే శాఖ, తాజాగా రిజర్వేషన్ల రద్దుపై భారీ స్థాయిలో సుంకం విధించింది. ఇంతవరకు ఉన్న రద్దు సుంకాన్ని రెట్టింపు చేసింది. దీంతో ఎవరైనా రైల్వే టికెట్ రద్దు చేసుకుంటే వారు టికెట్ ధరలో సగం మొత్తం రైల్వేలకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఫస్ట్ ఏసీ టికెట్లపై 240 రూపాయలు కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ టికెట్ల రద్దుపై 200 రూపాయలు, థర్డ్ ఏసీ టికెట్ల రద్దుపై 180 రూపాయలు, సెకెండ్ స్లీపర్ క్లాస్ 120 రూపాయలు, థర్డ్ క్లాస్ స్లీపర్ క్లాస్ టికెట్లపై 60 రూపాయలు వదులుకోవాలి. అలాగే బుక్ చేసుకున్న టికెట్ ను ప్రయాణానికి 48 నుంచి 12 గంటల్లోపు కేన్సిల్ చేస్తే టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు. అదే 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేసుకుంటే సగం ధరకు కోత పడుతుంది. వెయిటింగ్ లిస్టు, ఆర్ఏసీ లో ఉన్న టికెట్లు అర గంటలోపు రద్దు చేసుకోవాలి. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు కూడా ఈ ధరలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News