: పవన్ కల్యాణ్ కొత్త లుక్ మిస్టరీ వీడింది!
నేటి మధ్యాహ్నం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంచెకట్టులో కనిపించి అందర్లోనూ ఆసక్తి రేపాడు. పవన్ పంచెకట్టు స్పెషల్ లుక్ తెచ్చిందని, దీపావళి మరునాడు, కార్తీక మాసం ఆరంభంలో సంప్రదాయ దుస్తుల్లో పవన్ కల్యాణ్ సందడి చేయడంపై అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. దీనిపై పలు ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే వీటన్నింటిని పవన్ కల్యాణ్ కొట్టిపడేశాడు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయాన్నే పూజలో పాల్గొన్నానని, ఇంతలో మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చారని, ఆయనతో చర్చించి, అలాగే విజయవాడ బయల్దేరానని, అందుకే పంచెకట్టులో కనబడ్డానని, తన ఆహార్యంలో ఎలాంటి ప్రత్యేకతా లేదని ఆయన స్పష్టం చేశారు.