: ఆ ఫొటోలో ఉన్నది నేను కాదు...కానీ చాలా బాగుంది!: రిచర్డ్ గేరే


హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేరే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. 'టైమ్ అవుట్ ఆఫ్ మైండ్' అనే సినిమాలో రిచర్డ్ గేరే హోమ్ లెస్ మ్యాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా న్యూయార్క్ షెడ్యూల్ ఈ మధ్యే పూర్తైంది. ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని అదే మేకప్ లో అక్కడి న్యూయార్క్ లోని పేవ్ మెంట్ మీద తిరిగాడట. ఈ సందర్భంగా అక్కడ హోమ్ లెస్ పీపుల్ ను చూసి చలించిపోయాడని, ఈ సందర్భంగా అక్కడున్న వారికి వంద డాలర్ నోట్లను అలా పంచుకుంటూ వెళ్లిపోయాడని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్ చల్ చేసింది. అచ్చం రిచర్డ్ గేరేలా ఉన్న ఆ పోటో లక్ష లైకులు, 50 వేల షేర్లతో హల్ చల్ చేసింది. అయితే అది తాను చేసిన పోస్టు కాదని, తాను అలా న్యూయార్క్ లో వంద డాలర్ల నోట్లు పంచుతూ వెళ్లలేదని రిచర్డ్ గేరే స్పష్టం చేశాడు. ఆ పోటోలో ఉన్నది తాను కాకపోయినా ఆ ఫోటో చాలా బాగుందని, ఆ ఫోటోలో వ్యక్తి చాలా మంచి పని చేశాడని పేర్కొన్నాడు. ఈ ఫోటో ద్వారా తీవ్రమైన సమస్య తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఏం చేయవచ్చో అభిమానులతో కలిసి చర్చిస్తానని రిచర్డ్ గేరే వెల్లడించాడు.

  • Loading...

More Telugu News