: చంద్రబాబుకు అధికార ప్రతినిధిలా పవన్ మాట్లాడారు: అంబటి రాంబాబు


ఏపీ సీఎం చంద్రబాబును ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవడం, అనంతరం ఆయన మాట్లాడిన విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును ప్రశ్నిస్తాడనుకున్న పవన్... ఆయనకు అధికార ప్రతినిధిగా మాట్లాడారని ఆరోపించారు. ప్రశ్నించేందుకే తమ పార్టీ పుట్టిందన్న ఆయన... ఆ పని మానేసి రాజీ ధోరణిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీని నుంచి దృష్టి మరల్చేందుకే బాబు-పవన్ లు ఈరోజు భేటీ అయ్యారని, అదంతా ఓ డ్రామాగా ఉందని విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ మేరకు అంబటి మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ తో మాట్లాడేందుకు గన్నవరం విమానాశ్రయానికి రైతులు వస్తే ఆయన మాత్రం విమానం దిగిన వెంటనే నేరుగా కారులో చంద్రబాబుకు దగ్గరకు వెళ్లిపోయారన్నారు. రైతుల గోడు వినేందుకు కూడా పవన్ ప్రయత్నించడం లేదని దుయ్యబట్టారు. వారిద్దరి భేటీపై ఆశలు పెట్టుకున్న రాజధాని ప్రాంత రైతులకు పవన్ నిరాశే మిగిల్చారని అన్నారు. అసలు రైతుల సమస్యలను బాబుకు పవన్ ఎందుకు చెప్పలేదని అంబటి అడిగారు. ఇక బాక్సైట్ తవ్వకాలపై పవన్ కు అసలు అవగాహన లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News