: లంచం ఇవ్వలేదని మేడ మీద నుంచి తోసేసిన పోలీస్
పోలీసుల్లో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో తెలిపే సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నవడా జిల్లాలోని సహజ్ పూర్ గ్రామంలో ఓ జూదగాడిని పోలీసు లంచం అడిగాడు. అతనికి లంచం ఇచ్చేందుకు ఆ జూదగాడు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసు, అతనిని భవనంపై నుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్థులు పోలీసుల క్రూరత్వానికి నిరసనగా నవడా-జముయ్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.