: సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న కవలలు చేసిన కవలల వివాహం
కవలలు కవలల్ని వివాహం చేసుకోవడం అప్పుడప్పుడు మనం చూస్తూనే వుంటాం. అయితే వీరికి వివాహం జరిపించిన వారు కూడా కవలలే కావడం విశేషం. అంతేకాదు, కవల పెళ్లి కుమార్తెలకు తోడ పెళ్లి కూతుళ్లు కూడా కవలలే. అలాగే, కవల పెళ్లి కుమారులకు తోడుగా వచ్చిన తోడ పెళ్లికొడుకులు కూడా కవలలే. ఈ ముచ్చట కేరళలోని పూలూరులో చోటుచేసుకుంది. కవలలైన దిల్రాజ్, దిల్కర్ లు ఇంకో కవల జంట రీమా, రీనాను సెయింట్ జేవియర్ చర్చ్ లో క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరికి వివాహం చేసిన ఫాదర్లు కూడా (రెజీ, రోజీ) కవలలు కావడం విశేషం. వీరి వెంట వున్న తోడ పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు కూడా కవలలే అని చెబుతూ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. ఇంత మంది కవలలు ఒకే చోట చేరితే విశేషమేకదా మరి!