: 44 ఏళ్ల క్రితం ఇందిర ఆతిథ్యం స్వీకరించిన చోటే నేడు మోదీ బస!


మూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. తొలుత భారత్ లో బ్రిటన్ హైకమిషనర్ గా ఉన్న జేమ్స్ బీవెన్ నేతృత్వంలోని బృందం ఆయన్ను పూలమాలతో సత్కరించి లండన్ కు ఆహ్వానించింది. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు హూగో స్వైరీ కూడా ఈ బృందంలో ఉన్నారు. విమానాశ్రయం బయట వందలాది మంది భారత సంతతి యువతీ యువకులు, 'మోదీ మోదీ' అన్న నినాదాలతో ఆయనకు స్వాగతం పలుకగా, మోదీ సైతం చిరునవ్వుతో, వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయన పర్యటనను ఎవరైనా అడ్డుకోవచ్చన్న ఉద్దేశంతో భద్రతాదళాలు భారీ బందోబస్తును ఏర్పాటు చేశాయి. తన పర్యటనలో భాగంగా మోదీ నేటి రాత్రి 'చక్కర్స్'లో బస చేయనున్నారు. 44 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బసచేసిన చోటనే ఇప్పుడు మోదీ రాత్రిని గడపనున్నారు. ఈ రాత్రి 9:20కి బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News