: మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశా: కమలహాసన్
కేవలం మర్యాదపూర్వకంగానే తాను చంద్రబాబును కలసినట్టు ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తెలిపారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆహ్వానం వచ్చిందని, కానీ అప్పుడు రాలేకపోయానని చెప్పారు. అందుకే ఇప్పుడు నేరుగా వచ్చి అభినందనలు తెలిపినట్టు వివరించారు. ఇవాళ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కమల్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఏం శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. కాగా, తెలుగువారికి రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు ఉండటం శుభపరిణామమని శంకుస్థాపన సందర్భంగా కమల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.