: లండన్ పార్లమెంట్ గోడలపై భారత 'అసహనం'!


ఇండియాలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెలకొన్న 'అసహనం' ప్రకంపనలు ఆయన పర్యటిస్తున్న బ్రిటన్ దేశాన్ని తాకాయి. మోదీ రాకను నిరసిస్తూ, సామాజిక కార్యకర్తల వేదిక 'ఆవాజ్' ఈ ఉదయం లండన్ లో ప్రదర్శనలు నిర్వహించింది. తాము మోదీని స్వాగతించడం లేదని చెబుతూ, లండన్ పార్లమెంటు భవంతిపై ఆవాజ్ ఓ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేసింది. 'మోదీ నాట్ వెల్ కమ్' అంటూ కత్తి పట్టుకున్న మోదీ చిత్రాన్ని, వెనుక స్వస్తిక్, ఓం చిత్రాలను కలుపుతూ తయారు చేసిన లోగోను ప్రదర్శించింది. మోదీ అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్ కు వెళ్లిన వేళ, ఏకంగా పార్లమెంటు భవంతిపైనే ఈ పోస్టరును ప్రొజెక్ట్ చేయడాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇందుకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, తమ చిత్రానికి ఆవాజ్ వివరణ ఇస్తూ, ఇండియాలో మైనారిటీలు, దళితులపై ఆనాటి నాజీయిజాన్ని గుర్తుకు తెస్తూ దాడులు జరుగుతున్నాయని, అందువల్లే ఇలా చేశామని తెలిపింది.

  • Loading...

More Telugu News