: 'అమరావతి శంకుస్థాపన' శుభాకాంక్షలు తెలిపేందుకే సీఎంను కలిశా: పవన్ కల్యాణ్


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను రాలేకపోయానని, అందుకు సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకే ఇవాళ వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అంతేగాక రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్టు పవన్ చెప్పారు. విజయవాడలో సీఎంతో రెండు గంటల పాటు చర్చ అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాజధానిలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వం దృష్టి మొత్తం రాజధానిపైనే కాకుండా మిగతా ప్రాంతాల వైపూ చూడాలని ప్రస్తావించానన్నారు. ఇందుకు స్పందించిన సీఎం... ఎవరినీ బలవంతపెట్టి భూమిని తీసుకోబోమని చెప్పారన్నారు. అందరితో చర్చించాకే భూములు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. విశాఖ బాక్సైట్ తవ్వకాలపై ప్రధానంగా చర్చించామని పవన్ వెల్లడించారు. గనులపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కూడా పునరాలోచించుకోవాలని చంద్రబాబుకు సూచించినట్టు పేర్కొన్నారు. గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరానని, సమగ్రంగా చర్చించిన తరువాతే బాక్సైట్ పై ముందుకెళతామని చంద్రబాబు చెప్పినట్టు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రస్తావన వచ్చిందని, ప్రధాని నుంచి తుది ప్రకటన వచ్చాకే దీనిపై స్పందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News