: ఈ నిర్ణయం తీసుకోవడం ప్రతి క్రీడాకారుడికీ కష్టమే: యూనిస్ ఖాన్


ప్రఖ్యాత పాకిస్థానీ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై కేవలం టెస్టుల్లోనే కొనసాగనున్నాడు. అబుదాభిలో నిన్న ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డే అనంతరం తన రెటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూనిస్... చివరి వన్డేలో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరోవైపు, తన రిటైర్మెంట్ పై యూనిస్ మాట్లాడుతూ, 15 ఏళ్లపాటు దేశానికి ఆడటం ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. తన రిటైర్మెంట్ కు సంబంధించి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడం ప్రతి క్రీడాకారుడికీ చాలా కష్టతరమైనదని అన్నాడు. మాతృదేశం కోసం ఎంతో సిన్సియర్ గా క్రికెట్ ఆడానని, తన స్థానాన్ని యువకులు భర్తీ చేస్తారని చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ కు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉందని అన్నాడు.

  • Loading...

More Telugu News