: భేటీ తర్వాత అన్ని విషయాలూ చెబుతా: మీడియాతో పవన్ కల్యాణ్


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం హైదరాబాదు నుంచి విజయవాడ వచ్చిన జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ ను గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. తమ మైకులు పవన్ ముందు పెట్టి, మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, వారి ప్రశ్నలకు ముసిముసి నవ్వులు నవ్వుతూనే సమాధానాలు చెప్పిన పవన్ కల్యాణ్, చంద్రబాబుతో భేటీ తర్వాత అన్ని విషయాలు చెబుతానని అన్నారు. భేటీలో ఏఏ అంశాలను ప్రస్తావించనున్నారన్న ప్రశ్నకు కూడా పవన్ సూటిగా సమాధానం చెప్పలేదు. పరిస్థితిని బట్టి ఏఏ అంశాలు చర్చకు వస్తాయో చూడాలని కూడా ఆయన అన్నారు. భేటీ ముగిసే దాకా ఆగితే అన్ని విషయాలు వివరంగా చెబుతానని పేర్కొన్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News