: తమ స్టోర్ లో వివక్షపై 'సారీ' చెప్పిన యాపిల్


కొందరు నల్లజాతి విద్యార్థులను యాపిల్ స్టోర్ లోకి రానివ్వని ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తగా, యాపిల్ యాజమాన్యం క్షమాపణ కోరింది. ఈ ఘటన దురదృష్టకరమని, ఇకపై ఇటువంటివి జరగకుండా చూస్తామని వెల్లడించింది. మెల్ బోర్న్ లోని ఓ కాలేజీలో చదువుతున్న కొందరు ఆఫ్రికా విద్యార్థులు ఐఫోన్ ను కొనుగోలు చేసేందుకు వెళ్లగా, వారు దొంగలని అనుమానిస్తూ, స్టోర్ సిబ్బంది వారిని గెంటేశారు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి 'సింపుల్ రేసిజం' అంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టగా, విమర్శలు వెల్లువెత్తాయి. యాపిల్ క్షమాపణల తరువాత బుధవారం నాడు వారు తిరిగి స్టోర్ కు వచ్చి షాపింగ్ చేశారని, వారికి సాదర స్వాగతం పలికామని స్టోర్ యాజమాన్యం వెల్లడించింది.

  • Loading...

More Telugu News