: షారుఖ్ ను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ నేత నిలదీత


బాలీవుడ్ సినీ నటుడు షారుఖ్ ఖాన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ నేత రణదీప్ సురెజ్ వాలా ట్విట్టర్ లో మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో పెరిగిపోతున్న మత అసహనంపై మాట్లాడినందుకే ఖాన్ ను ఈడీ లక్ష్యంగా చేసిందని పరోక్షంగా ఆరోపించారు. ఈ మేరకు "దీపావళి రోజు షారుఖ్ ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారా? లేక మనసులో ఉన్నది ఆయన మాట్లాడారని టార్గెట్ చేశారా? ప్రభుత్వం ప్రతీకార చర్యలకు ఈడీ కొత్త ఆయుధంగా మారిందా?" అని రణదీప్ ట్విట్టర్ లో సూటిగా ప్రశ్నించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ కుమార్తె వివాహం జరిగిన రెండోరోజే ఆయన నివాసంలో ఇటీవల ఈడీ అధికారులు సోదాలు జరపడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News