: ఈ మధ్యాహ్నం చంద్రబాబును కలవనున్న సినీ నటుడు కమలహాసన్
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ఆయన సీఎంను కలుస్తారు. దాదాపు రెండు గంటలపాటు చంద్రబాబుతో కమల్ భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిని ఆయన ఎందుకు కలుస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కూడా సీఎంను కలిశారు. మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.