: నాలుగు స్తంభాలాటగా తెలంగాణ పాలన: కిషన్ రెడ్డి
తెలంగాణలో పరిపాలన అధ్వానంగా తయారైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావుల నేతృత్వంలో పాలన నాలుగు స్తంభాలాటగా మారిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవ్వడానికే డబుల్ బెడ్ రూమ్ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందని చెప్పిన కిషన్ రెడ్డి... బీజేపీ అభ్యర్థి దేవయ్యను గెలిపిస్తే వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని మండిపడ్డారు.