: బాక్సాఫీస్ వద్ద 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సందడి... తొలి సమీక్షలు పాజిటివ్!


సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఈ ఉదయం థియేటర్లను తాకగా, చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. తొలి సమీక్షల ప్రకారం, ఈ చిత్రం ఘన విజయం సాధించినట్టని, ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమని సమాచారం. ఎంతో పాప్యులర్ అయిన 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్' కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని, ఓ రాజుగా, ఓ సామాన్యుడిగా సల్మాన్ ద్విపాత్రాభినయం చిత్రానికి ఆకర్షణని ట్వీట్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాన్ని వదిలి సామాన్యుడిగా బతకాలన్న కోరికతో, తన మాదిరిగానే కనిపించే ఓ సామాన్యుడి స్థానంలో బయటకు వెళ్లే 'ప్రేమ్' పాత్రలో సల్మాన్ ఒదిగిపోయాడని అభిమానులు అంటున్నారు. భారీ సెట్టింగ్స్, లైటింగ్స్, వేలాదిమంది ఆర్టిస్టులతో నయనానందకరంగా ఉందని చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News