: పంచెకట్టులో విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పవన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబుతో దాదాపు గంటపాటు ఆయన సమావేశమవుతారు. ఏపీ రాజధానికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించనున్నారు. కాగా, ఎప్పటిలా కాకుండా ఈసారి తెల్ల చొక్కా, తెల్ల పంచెలో పవన్ తన పర్యటనలో ఆకర్షించనున్నారు. ఇదే గెటప్పులో ఆయన 'గబ్బర్ సింగ్' చిత్రంలో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News