: కేసీఆర్ యాగానికి వెళ్లే యోచనలో చంద్రబాబు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోతున్న చండీయాగానికి వెళ్లే యోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చినందువల్ల, ఆయన నిర్వహిస్తున్న యాగానికి వెళితేనే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. టీటీడీపీ నేతలతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ నుంచి ఆహ్వానం అందితే తాను తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టం చేశారట. మరోవైపు, చంద్రబాబును ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్ కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇరు రాష్ట్రాల అభ్యున్నతి కోసం విభేదాలను పక్కనపెట్టి సఖ్యంగా ఉండాలని ఇరువురు ముఖ్యమంత్రులు భావిస్తుండటం శుభసూచకం.

  • Loading...

More Telugu News