: విదేశాలకు వెళ్తారు గానీ, తెలంగాణకు రాలేరా?: మోదీపై కేటీఆర్ రుసరుసలు
పలు దేశాలను చుట్టి వచ్చేందుకు కావాల్సినంత సమయం తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు రావడానికి మాత్రం ఇష్టపడటం లేదని ఐటీ మంత్రి కేటీఆర్ రుసరుసలాడారు. ఆయనకు తెలంగాణకు వచ్చే తీరిక ఉన్నట్టు కనిపించడం లేదని అన్నారు. వరంగల్ లో జరిగిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగిస్తూ, టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఇతర పార్టీలకు నామినేషన్ల ముగింపు రోజు వరకూ అభ్యర్థులే దొరకలేదని ఆయన అన్నారు. వరంగల్ కు వచ్చే ధైర్యం చేయలేకనే ప్రధాని ముఖం చాటేశారని అన్నారు.