: ఢిల్లీ, ముంబైల్లో భారీ అగ్ని ప్రమాదాలు...దీపావళి నిప్పురవ్వలే కారణమంటున్న పోలీసులు


దీపావళి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు హోరెత్తాయి. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలోనూ నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రాత్రి నుంచి ఎగసిపడుతున్న అగ్ని కీలలు ఎంతకీ అదుపులోకి రావడం లేదు. రెండు నగరాల్లో ఎగసిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది నేటి ఉదయం వరకూ శ్రమిస్తూనే ఉన్నారు. ఢిల్లీలో ఓ టైర్ల కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. పది ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కంపెనీలో పెద్ద సంఖ్యలో టైర్లు ఉన్న నేపథ్యంలో మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక ముంబైలో చోటుచేసుకున్న ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఈ రెండు ప్రమాదాలకు దీపావళి సందర్భంగా ఎగసిన నిప్పురవ్వలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News