: దీపావళి ‘మంటలు’... తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల పరంపర


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. సంబరాల వెంటే ప్రమాదాలు కూడా రెండు రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టాయి. సంబరాల్లో భాగంగా ఎగసిన నిప్పురవ్వల కారణంగా హైదరాబాదు, విజయవాడ, భువనగిరి తదితర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో మంటలు ఎగసిపడ్డాయి. అదేవిధంగా వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో మూడు గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అబిడ్స్ లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇక విజయవాడలో నింగికెగసిన నిప్పురవ్వల కారణంగా మూడు స్కూల్ బస్సులు కాలిపోయాయి. నల్లగొండ జిల్లా భువనగిరిలోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు, ఓ కారు, మరో బైకు కాలి బూడిదయ్యాయి.

  • Loading...

More Telugu News