: అక్షయ్ కుమార్ ఇంటికి క్యూ కట్టిన బాలీవుడ్


యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంటికి బాలీవుడ్ నటీనటులు క్యూకట్టారు. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్షయ్ కుమార్ తన నివాసంలో సహ నటులకు పార్టీ ఇచ్చారు. అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా రచించిన 'మిసెస్ ఫన్నీ బోన్స్' పుస్తకం విజయవంతమైన సందర్భానికి తోడు పండుగ కూడా రావడంతో అక్షయ్ దంపతులు ఈ విందు ఇచ్చారు. ఈ విందుకు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, జితేంద్ర, రిషి కపూర్, సునీల్ షెట్టి, మాధవన్, కరణ్ జోహర్, కరిష్మా కపూర్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా దేశ్ ముఖ్, లారాదత్తా, ఏక్తా కపూర్ తదితరులు హాజరయ్యారు. ఈ విందు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా నిలిచింది.

  • Loading...

More Telugu News