: తనదైన శైలిలో నెటిజన్లలో నవ్వులు పూయించిన వర్మ ట్వీట్లు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ విషయాన్నైనా తనదైన శైలిలో విమర్శించడంలో సిద్ధహస్తుడు. తాజాగా దీపావళిపై రాంగోపాల్ వర్మ ట్వీట్లు సంధించాడు. ఈ రోజు రాత్రి ఎలాంటి అనుకోని ఘటనల వల్ల మీ ఆస్తులు, ఆనందం కాలిపోవద్దని కోరుకుంటున్నానంటూ వర్మ ట్వీట్ చేశాడు. కాలిన తరువాత పరిణామాలను ఎదుర్కోగలిగే ధైర్యమున్న ప్రతి ఒక్కరికీ అన్ సేఫ్ హ్యాపీ దీవాళీ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. మనలో ఏ ఒక్కరికీ నరకాసురుడు చేసిన అన్యాయం ఏంటో ఎవరికీ తెలియదు, కానీ మనం అతని చావును ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అయినా మనకి పండగ చేసుకోవడానికి ఓ రీజన్ కావాలి కదా? అంటూ ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లతో పాటు తన తాజా సినిమా కిల్లింగ్ వీరప్పన్ లో కాల్పుల సన్నివేశం పోస్టు చేశాడు. అయితే ప్రతిసారీ వర్మ ట్వీట్లపై భిన్నాభిప్రాయాలు కన్పించినట్టే ఈ సారి పలువురు స్పందిస్తున్నారు.