: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు చిన్నారులు సహా నలుగురి దుర్మరణం


దీపావళి పర్వదినాన ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి- చిత్తూరు మధ్య చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. కర్ణాటకకు చెందిన ఓ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు సహా వారి ఇద్దరు పిల్లలు కూడా అక్కడికక్కడే చనిపోయారు.

  • Loading...

More Telugu News