: సునంద పుష్కర్ పై విషప్రయోగం జరగలేదట... ఢిల్లీ పోలీసులకు అందిన ఎఫ్ బీఐ నివేదిక


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మరణానికి విష ప్రయోగం కారణం కాదట. ఆమెపై విష ప్రయోగం జరిగినట్లు ఆధారాలే లేవట. ఈ మేరకు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తన నివేదికను ఢిల్లీ పోలీసులకు అందజేసింది. శశి థరూర్ కేంద్ర మంత్రి పదవిలో ఉండగానే, ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ లో సునంద పుష్కర్ చనిపోయింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె మృతదేహానికి ఎయిమ్స్ వైద్యుల చేత పోస్ట్ మార్టం చేయించారు. విష ప్రయోగం కారణంగానే సునంద చనిపోయినట్లు ఎయిమ్స్ వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే మృతురాలి శరీరంలోని విషాన్ని గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు భారత్ లో అందుబాటులో లేవని తెలిపారు. దీంతో సునంద శరీరానికి సంబంధించిన శాంపిళ్లను ఢిల్లీ పోలీసులు ఎఫ్ బీఐకి పరీక్షల నిమిత్తం పంపారు. సదరు శాంపిళ్లను సునిశితంగా పరిశీలించిన ఎఫ్ బీఐ నిన్న ఢిల్లీ పోలీసులకు నివేదిక అందజేసింది. సునంద శరీరంలో పొలోనియం సహా మరే ఇతర రేడియో ధార్మిక పదార్థాలు లేవని సదరు నివేదికలో ఆ సంస్థ తేల్చిచెప్పింది. తద్వారా సునందపై విష ప్రయోగం జరగలేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News