: ఘనంగా సత్యసాయి ద్వితీయ ఆరాధనోత్సవాలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా ద్వితీయ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన వేడుకల్లో భక్తులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సత్యసాయి భక్తురాలైన మంత్రి గీతారెడ్డి కూడా హాజరయ్యారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకునేందుకు దేశ, విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి చేరుకున్నారు.