: నాడు మేకప్ ఆర్టిస్టు... నేడు ఒంటె పాల వ్యాపారి!
మేకప్ ఆర్టిస్ట్ గా తన బిజీలైఫ్ ను వదిలి పెట్టి ఒంటెల వ్యాపారంలోకి దిగిన ఆ అమ్మాయి పేరు హన్నా ఫ్రుస్. ఆస్ట్రేలియాకు చెందిన హన్నాకు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే, తన ప్రొఫెషన్ ను సైతం పక్కనపెట్టి ఒంటెలను పెంచుతోంది. ఆమె వద్ద ప్రస్తుతం 30 ఒంటెలు వున్నాయి. క్రమంగా ఒంటెపాలతో వ్యాపారం చేయడం ప్రారంభించింది. రోజుకు కనీసం 30 నుంచి 40 లీటర్ల పాలు వస్తాయని, ఒంటె పాల డెయిరీ కేంద్రాన్ని ప్రారంభించానని హన్నా చెప్పింది. చాక్లెట్ల తయారీ సంస్థల వారు తమ వద్ద నుంచి ఒంటె పాలను కొనుగోలు చేస్తారని ఆమె తెలిపింది. లాక్టోస్ తక్కువగా ఉన్న వాళ్లు ఒంటె పాలను తాగితే ప్రయోజనం ఉంటుందని అంటోంది. మరిన్ని ఒంటెలను కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటానని 27 సంవత్సరాల హన్నా చెబుతోంది.