: కేసీఆర్ కు వరంగల్ లో ఓట్లడిగే హక్కులేదు: జీవన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరంగల్ ఉపఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల పేరిట ఉపముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తప్పించిన కేసీఆర్, తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. దళితుడని అన్యాయంగా పదవి నుంచి తప్పించిన కేసీఆర్ కు వరంగల్ ఉపఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కులేదని అన్నారు. కేసీఆర్ ద్వంద్వ వైఖరికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ను వరంగల్ ప్రజలు గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.