: మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి ఎత్తివేత
మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తి వేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గత నెల చివర్లో కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ పై హత్యాయత్నం జరిగింది. దీనిని తప్పించుకుని, స్వల్పగాయాలతో క్షేమంగా బయటపడ్డ అబ్దుల్లా యామీన్ విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ ను నిందితుడుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ విధ్వంసం చోటుచేసుకుంది. అదీబ్ అనుచరులు ఆందోళన ప్రారంభించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం ఆందోళనకారులను చెదరగొట్టింది. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మాల్దీవుల్లో ఈ నెల 4న ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఎమర్జెన్సీ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.