: మోదీ జీ! మైనార్టీల్లో ఉన్న భయాన్ని తొలగించండి...‘దళ్’ నుంచి బయటపడండి: ఆజాంఖాన్
"మైనార్టీ వర్గాల్లో ఉన్న భయాన్ని తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పని చేయాలి. ‘దళ్’ నుంచి మోదీ బయటపడి, దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి" అంటూ సమాజ్ వాది పార్టీ నేత ఆజాం ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘బీహార్ ఎన్నికలు దేశ భవిష్యత్ ను నిర్ణయించాయి. బీహార్ తరహా వాతావరణం కావాలని ప్రతిపౌరుడు కోరుకుంటున్నాడని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. బీహార్ ఎన్నికల ఫలితాలను కేవలం ఒక సంఘటనగా కాకుండా అనుభవంగా చూడాలని ప్రధానిని కోరుకుంటున్నాను. మోదీలో కొత్త వ్యక్తి పుట్టేందుకు తనకు తానుగా చొరవ తీసుకోవాలి. విశ్వంలో ప్రతిదీ దేవుడి సృష్టే. మరి, అటువంటి వాటిపై ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటే, ఆ దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించడు’ అంటూ ఆజాంఖాన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.