: బీజేపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు: సీఎం సిద్ధరామయ్య
బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసినప్పటికీ బీజేపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు వీహెచ్ పీ, బీజేపీ, హిందూసేన కార్యకర్తలు అడ్డుకోవడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. మత అసహనాన్ని నిరసిస్తూ బీహార్ ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికీ... వీరిలో మాత్రం మార్పు రాలేదని అన్నారు. మరోవైపు, కర్ణాటకలోని మడికెరిలో జరిగిన ఆందోళనల్లో ఒక వీహెచ్ పీ నేత మృతి చెందాడు.