: ఎల్లుండి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాదిలో మరోసారి విదేశీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి విదేశీ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. 16వ తేదీ వరకు బ్రిటన్, టర్కీ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. టర్కీలో జరిగే జీ-20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. బ్రిటన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో రాణి ఎలిజబెత్ ఏర్పాటు చేసే విందు సమావేశానికి ప్రధాని హాజరవుతారు.