: తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో పురోగతి సాధించిన పోలీసులు


గుంటూరు జిల్లా వెల్దుర్తిలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తిరుపతమ్మ ఆత్మహత్యకు కారణమైన ఆరుగురు విద్యార్థులను పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. వెల్దుర్తి నుంచి మాచర్లలోని కళాశాలకు రోజూ బస్సులో వెళ్లే తిరుపతమ్మను అదే బస్సులో వివిధ కళాశాలలకు వెళ్లే ఆరుగురు విద్యార్థులు వేధించేవారు. ఈ అనుభవాన్ని కేవలం తిరుపతమ్మే కాదు, అదే బస్సులో ప్రయాణించే చాలా మంది విద్యార్థినులు చవిచూశారు. అయితే వారిలో కొందరు ఆ అబ్బాయిలతో స్నేహం చేసి వేధింపులు తప్పించుకోగా, తిరుపతమ్మ వారి వేధింపులకు బెదరలేదు. ఈ క్రమంలో వారి వేధింపులు పెరిగిపోవడంతో వారిని తానేమీ చేయలేనని భావించి, వారిని ముక్కలుగా నరకాలని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను నేడు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News