: హైదరాబాదులో చెల్లని రూపాయి వరంగల్ లో ఎలా చెల్లుతుంది?: కేటీఆర్


వరంగల్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణను చెల్లని రూపాయితో పోల్చారు టీఎస్ మంత్రి కేటీఆర్. హైదరాబాదులో చెల్లని రూపాయి వరంగల్ లో చెల్లుతుందా? అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థిని ఉద్దేశించి మాట్లాడుతూ, 'డాలర్లకు ఓట్లు రాలవు' అన్నారు. ఈ రోజు వరంగల్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎలాంటి బియ్యం తింటున్నారో... అలాంటి బియ్యాన్నే హాస్టళ్లలోని పేద విద్యార్థులకు కూడా పెడుతున్నామని తెలిపారు. పెద్దవాళ్లంతా కేసీఆర్ ను తమ పెద్ద కుమారుడిగా చూస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ ను గెలిపించాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News